బలభద్రపురంలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు 12న ప్రత్యేక పూజలు – సుందరకాండ పారాయణం – మహా అన్నప్రసాద వితరణ
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి హనుమజ్జయంతి మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ మంగళవారం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి స్వామి వారికి మహన్యాసపూర్వక అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం...