బలభద్రపురంలో పంట పొలాలకు తుపాను దెబ్బ

  ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి – రైతులను ఆదుకోవాలని డిమాండ్ బిక్కవోలు      సెప్టెంబర్  25: వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఊర చెరువు పరిసరాల్లోని వందల ఎకరాల వరి పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముంపు పరిస్థితులను పరిశీలించేందుకు అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బలభద్రపురంలో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి...