పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి
తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని పలు దేవాలయాలకు రాయవరం వాస్తవ్యులు కాళ్ళకూరి సత్యనారాయణ , వారి సతీమణి శ్రీమతి రంగనాయకి కృష్ణకుమారి తమ పుట్టినరోజు సందర్భంగా ఆలయాలుకు విశేష విరాళాలు అందజేసి భక్తి చాటుకున్నారు.
గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ భూగర్భ వారాహి మాత ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న దంపతులు, అమ్మవారి అలంకరణ మరియు ఆలయ సేవా కార్యక్రమాల నిమిత్తం 250 గ్రాముల వెండిని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
అనంతరం గ్రామంలోని శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి 
వారు సహిత పార్వతీ పరమేశ్వర ఆలయాన్ని సందర్శించిన వారు, స్వామివారి సేవా కార్యక్రమాలు మరియు ఆలయ అభివృద్ధి కోసం 500 గ్రాముల వెండిని కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
అలాగే బలభద్రపురంలోని ఆంధ్ర షిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని, బాబా వారికి భక్తి పూర్వకంగా 250 గ్రాముల వెండిని సమర్పించారు. సాయిబాబా ఆశీస్సులతో తమ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, పుట్టినరోజు వంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ఆలయాలకు వెండి విరాళాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తి, దాతృత్వం కలగలిపిన ఈ సేవా కార్యక్రమం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
శ్రీ కాళ్ళకూరి సత్యనారాయణ – శ్రీమతి రంగనాయకి కృష్ణకుమారి దంపతులు ఆలయాల అభివృద్ధికి అందిస్తున్న సహకారం మరింతగా కొనసాగాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ భూగర్భ వారాహి మాత, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు, పార్వతీ పరమేశ్వరులు మరియు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు ఆకాంక్షించారు.
