POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:54 pm Posted by : POLITICAL POWER

బలీదుపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరిక…..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: పెద్దమందడి మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 25 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగిపోయిన కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్, మాజీ ఎంపీటీసీ గణేష్, బలీదుపల్లి గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షులు సుగురు నరసింహ, నాయకులు నారన్న, ప్రతాప్ రెడ్డి, సోషల్ మీడియా నాయకులు ఆంజనేయులు, చంద్రయ్య, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.