బల్దియాల్లో కౌన్సిలర్ల ‘వసూళ్ల వల’…
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ లోని మున్సిపాలిటీల్లో అనుమతులు, సెటిల్మెంట్లు, ఫిర్యాదుల పరిష్కారం పేరుతో కొందరు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సమాంతర వ్యవస్థ నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారిక రుసుములకు తోడు 'మాట్లాడుకోవాలి' పేరుతో యజమానుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అవినీతితో మున్సిపల్ పాలన ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు స్పందించకపోతే ఇది మరింత విస్తరించే ప్రమాదం ఉంది.