POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:14 pm Posted by : POLITICAL POWER

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం,

–  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.08.2026.రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ ఫీజును వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్. రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికివిజ్ఞప్తిచేశారు.శనివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 1250 బార్లు ఉన్నాయని, వాటిలో 62,500 మంది వరకు ఉపాధి పొందుతున్నారని, వారి నుంచి వారి కుటుంబ సభ్యులు దాదాపు 3 లక్షల 75 వేల మందికి బార్ల ద్వారా జీవనం కొనసాగుతుందన్నారు.నేడు ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు పెంచడం వల్ల బార్లు మూతపడే అవకాశం ఉందని, దీంతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందన్నారు.దీనంతటికీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తీరే ప్రధాన కారణమని, కమిషనర్ ఇచ్చిన తప్పుడు నివేదికతోనే ప్రభుత్వం ప్రివిలేజ్ ఫీజు పెంచుతూ జీవో జారీ చేయడం జరిగిందని మండిపడ్డారు.ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కనీస సమాచారం లేకుండా కమిషనర్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుందన్నారు.నిత్యం పబ్బుల్లో గడిపే కమిషనరుకు బార్ అండ్ రెస్టారెంట్లపై అవగాహన లేనట్టుందని, అవగాహన లేని తనంతోనే లక్షల మందికి ఉపాధిని దూరం చేసే విధంగా కమిషనర్ పోకడలు కొనసాగుతున్నాయని అన్నారు.కొన్ని సందర్భాల్లో అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎంకు విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ప్రివిలేజ్ ఫీజు పెంచడం వల్ల బార్లు నడిచినా నడవకపోయినా ప్రతిరోజు ప్రభుత్వానికి దాదాపు రూ. 30 వేలు టాక్స్ కట్టాల్సి వస్తుందని, నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు.కరోనా లాంటి కష్టకాలంలో కూడా బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోయినా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టారని గుర్తు చేశారు.ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కమిషనర్ హరికిరణ్ తీరు వల్ల ప్రజా ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందనిదుయ్యబట్టారు.ఒకపక్క ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, మరో పక్క లక్షల మందికి ఉపాధిని దూరం చేస్తున్న కమిషనర్ తీరు ఇకనైనా మార్చుకోవాలనిహితవుపలికారు.కమీషనర్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ఆయన అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో సహా సిబి సిఐడికి ఫిర్యాదు చేయడంతో పాటు ఢిల్లీ లోనిడివోపిటిలోకూడాఫిర్యాదుహెచ్చరించారు.కేవలం ప్రభుత్వం ఇస్తున్న జీతం మీదే ఆధారపడి, ఎలాంటి నెల మామూళ్ళు తీసుకోకుండా పనిచేస్తున్న ఎక్సైజ్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే గుండె మీద చేయి వేసుకొనిచెప్పాలనిసవాలువిసిరారు.ప్రభుత్వం ఇకనైనా స్పందించి తక్షణమే పెంచిన ప్రివిలేజ్ ఫీజుపై పునరాలోచన చేసి, బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు చాపలి వెంకటేష్, శ్రీధర్, సిద్ధార్థ్, రామ్ మాధవ్, మంజునాథ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మారుతి,లింగప్ప, తిరుపతి, పూల శ్రీను, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.