POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 9:22 am Posted by : POLITICAL POWER

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

 

తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న కిరణ్ 

రానున్న ఐదు సంవత్సరాలలో అడ్వకెట్స్ కు అండదండగా ఉంటా… కిరణ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 14, 2026: నేడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బార్ కౌన్సిల్ ఇండియా సభ్యునిగా గన్నమనేని కిరణ్ ఎన్నికయ్యారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా ఎస్. రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా కిరణ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నా పై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన సభ్యులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అదేవిదంగా అడ్వకేట్స్ వెల్ఫేర్, మరియు ప్రతి అడ్వకేట్ కు అడ్వకేసి పై పూర్తి అవగాహనా కలిగే విధంగా ప్రత్యేక సెమినార్స్ బీసీఐ మెంబర్‌గా బాధ్యతగా న్యాయ విద్య న్యాయ కళాశాలల ప్రమాణాల పర్యవేక్షణ, న్యాయవాదుల వృత్తి ప్రొఫెషనల్ కండక్ట్ రూల్స్ రూపొందించడం, స్టేట్ బార్ కౌన్సిళ్ల సమన్వయం, పర్యవేక్షణ క్రమశిక్షణ చట్టం ప్రకారం అప్పీళ్లను పరిశీలించడం, న్యాయవాదుల హక్కులు, వృత్తి స్వాతంత్ర్యం, సంక్షేమం పరిరక్షణ న్యాయ సంస్కరణలు ప్రభుత్వానికి, న్యాయ సంస్థలకు సూచనలు చట్టపరమైన అనేక అంశాలవిషయంలో అందరికి అందు బాటులో ఉంటానని అన్నారు , అదేవిధంగావిజయంలో వెన్నంటి ఉన్న నాంపల్లి యంసిసిబిఏ అడ్వకేట్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై కోర్టు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డి ఎల్ పాండు, మాజీ ట్రెసరర్ పొడిచేడు వెంకన్న గౌడ్, యంసిసిబిఏ ప్రెసిడెంట్ రెట్టాల బాల్ రాజ్ గౌడ్, జనరల్ సెక్రటరీ రాజంపేట వేణుగోపాల్, సంగారెడ్డి మాజీ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి, ముమ్మిడివరపు సత్యనారాయణ, సౌకారి శ్రీనివాస్, శ్రీనాథ్ బాబు, తిరుపతి వర్మ, ఐ ఎన్ టి యు సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హై కోర్టు అడ్వకేట్ డాక్టర్ మురహరి బుద్దారం తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేశారు.