కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీగా వలసలు
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.6 సెప్టెంబర్ 2026.
రుద్రూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. బిజెపి పార్టీ నుండి రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ అధ్యక్షులు నారోజి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుండి తగ్గెల్లి కిరణ్, బొమ్మిడి పాపయ్యలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రవి కిరణ్ మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించారని, కెసిఆర్ చేసిన పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారని వివరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరిగాది శేఖర్, నితిన్ పటేల్, చింతల నరేందర్, సాయిలు యువజన నాయకులు జువ్వల శ్రావణ్, వంజరి సుమన్, టింకు గౌడ్, మద్ది మధు, పట్ల శ్రీకాంత్, పట్ల సంతోష్, సయ్యద్ కిజర్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.