POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 8:59 am Posted by : POLITICAL POWER

బిక్కవోలులో రూ.1.10 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

 

పాల్గొన్న ఎంపి పురంధేశ్వరి

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 23:


తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బిక్కవోలులో రూ.1 కోటి 10 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూ.63.50 లక్షలతో నిర్మించిన బిక్కవోలు మెయిన్ రోడ్ నుంచి స్మశానవాటికకు వెళ్లే సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే దాతల సహకారంతో రూ.47 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన స్మశానవాటిక, చెత్త శుభ్రపరిచే సదుపాయాలు, స్నాన ఘట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్మశానవాటిక అభివృద్ధికి సహకరించిన దాతలను, శ్రమదానం చేసిన ట్రాక్టర్ యజమానులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.