బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొమరిపాలెం గ్రామ శివారులోని చేపల చెరువుల వద్ద అక్రమ బాణసంచా తయారీ జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు బిక్కవోలు పోలీసులు తనిఖీలు చేపట్టి, అక్కడ అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుబ్బల వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో భారీగా బాణసంచా తయారీ సామగ్రి పట్టుబడింది. సుమారు 2.660 కిలోల దీపావళి ఔన్సులు, సుమారు 19.5 కిలోల...