బిక్కవోలు మండల టాపర్‌గా బలభద్రపురం విద్యార్థిని బిందు మేఘన – 591 మార్కులతో అద్భుత ప్రతిభ

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 02: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన ఓ ప్రతిభావంతురాలి విజయగాథ ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన మండ వీరెడ్డి – సునీత దంపతుల కుమార్తె బిందు మేఘన, బిక్కవోలు గ్రామంలోని నేతాజీ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో బిందు మేఘన 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి...