పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల రాంబాబు తండ్రి సోరకాయల పున్నయ్య మంగళవారం ఉదయం అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం మోండివర్రె గ్రామంలోని వారి స్వగృహానికి చేరుకుని పున్నయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం సోరకాయల రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి మనోధైర్యం నింపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండి ప్రసాద్, బుక్క వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.