బీఆర్ఎస్ నాయకుడి తండ్రి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన సోయం వీరభద్రం

 పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల రాంబాబు తండ్రి సోరకాయల పున్నయ్య  మంగళవారం ఉదయం అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం మోండివర్రె గ్రామంలోని వారి స్వగృహానికి చేరుకుని పున్నయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం సోరకాయల రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ...