పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.15. 2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని అమ్ముడబాకుల గ్రామ శివారులోని బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. బాటసారులు తెలిపిన సమాచారం మేరకు కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై. ఎం. విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం. మృతుడి వయస్సు సుమారు 38 సంవత్సరాలు ఉంటుందని, ఎత్తు సుమారు 5.5 అడుగులు, చామన ఛాయతో ఉన్నాడని తెలిపారు. మృతుడు నీలిరంగు టీషర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. టీషర్ట్‌పై ‘ టీం. మురళీధర్ హెగ్డే’ అని ముద్రించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి ఆచూకీ, గుర్తింపు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై ఎం. విక్రమ్ కోరారు. సమాచారం తెలిసిన వారు 8712670621, 9182183213 నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.