POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:15 pm Posted by : POLITICAL POWER

బీర్ మానవ మృగానికి, బలి అయిన శిరీష కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్) సెప్టెంబర్ 1 2026: ములకలపల్లి అశ్వారావుపేట తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఊకే శిరీష అత్యాచారం, హత్య ఘటన పై పలువురు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి చౌటుగూడెం చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి, దుఃఖ సముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, తాండ్ర ప్రభాకర్ రావు, బత్తుల అంజి ఈర్ల రామ్మోహన్ రావ్, గాడి తిరుపతిరెడ్డి, పాలకుర్తి సమిత్, పాలకుర్తి రత్నభూషణం, తదితరులు పాల్గొన్నారు.