POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:39 pm Posted by : POLITICAL POWER

బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి:

నందాల అనిల్ కుమార్ (కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, యాకుత్‌పుర) – టీఆర్ఎస్ నాయకుడు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: హైదరాబాద్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సభను టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని టీఆర్ఎస్ నాయకుడు, యాకుత్‌పుర కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నందాల అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమిస్తున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధనలో భాగంగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు జరుగుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి నగర్ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకురాలు కట్టల శారద ముదిరాజ్, హరిబౌలి డివిజన్‌కు చెందిన సోను బాయ్, సునీత, విజయ్, రాజు, నిఖిల్తో పాటు పలువురు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.