పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 21 2026: బిసి పొలిటికల్ జెఎసి మహిళా విభాగం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలుగా శ్రీవిద్య నియామకం అయ్యారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే భవన్లో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ హాజరై ఆమెకు కండువా కప్పి నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ… శ్రీవిద్య గౌడ్ ఉన్నత విద్యావంతురాలని, సేవాభావం కలిగి, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని, పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారన్నారు. మహిళలను చైతన్యం చేసి, రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శ్రీవిద్య గౌడ్ మాట్లాడుతూ… నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కు, జిల్లా అద్యక్షులు అరవిందా చారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఎంతో బాధ్యతగా మహిళల రిజర్వేషన్ పట్ల, మహిళల సాధికారత, సమానత్వం వంటి అంశాలపై పోరాటాలు చేసి బీసీలందర్నీ చైతన్యపరిచి ఏకతాటిపైకి తీసుకువచ్చి నాగర్ కర్నూల్ తాలూకా ఎమ్మెల్యేగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ మహిళను గెలిపించుకునే విధంగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమం అనంతరం శ్రీవిద్య ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ధర్మేంద్ర సాగర్, యశ్వంత్ గౌడ్, రాజు, ప్రవీణ్, నాగ శేషు, శ్రీధర్, సురేష్, రమేష్, గోపాలకృష్ణ,బీవమ్మ, సంధ్య, శిరీష, గాయత్రి, అనూష, స్వాతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.