ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి -డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం కొత్తకోటలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహాన్ని విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నా… హాస్టల్ గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో శిధిలావస్థలో ఉన్న బీసీ హాస్టల్ భవనం కూల్చి కొత్త భవనం నిర్మించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు మరియు కాస్మొటిక్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి… బీసీ హాస్టల్ భవనానికి వెంటనే నిధులు మంజూరు చేయించాలని కోరారు. అలాగే కొత్తకోటలో బీసీ బాలికల వసతి గృహం లేక చాలా మంది నిరుపేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, బాలికల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే బాలికల ప్రీ మెట్రిక్ హాస్టల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కృష్ణప్రసాద్, ధర్మేంద్ర సాగర్, యశ్వంత్ గౌడ్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

వేముల వెంకట్రావును పరామర్శించిన చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

విజయవాడ (చిట్టినగర్): పొలిటికల్ పవర్ ప్రతినిధివిజయవాడ చిట్టినగర్ నివాసి, బీసీ...

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం...

కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ....

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే...

Related Articles

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు...

ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..

రైతులకు మెరుగైన మార్కెట్‌ సేవలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెబ్బేరులో నూతన భవిత...
error: Content is protected !!