పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 18 2026: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామంలో మహిళా సంఘాలు పేద మహిళల ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థలను కొందరు వ్యక్తులు రాజకీయ కేంద్రాలుగా మార్చి మహిళల నిధులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయని, రైతుల ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, రికార్డుల్లో తేడాలు, కమిషన్ దందాలు జరిగాయని ఆరోపించారు. “నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ప్రభుత్వ అనుబంధ వ్యవస్థల్లో కొనసాగించడం అంటే అవినీతికి అధికార ముద్ర వేయడమే. మహిళా సంఘాల పేరుతో జరుగుతున్న దందాలకు అధికారులు మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది” అని ఆర్టిఐ ఫోరం మండల అధ్యక్షులు తీవ్రస్థాయిలో విమర్శించారు.

అలాగే: మహిళా సంఘ ఖాతాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, ఐకెపి కొనుగోలు కేంద్రాల లావాదేవీలను ప్రజల ముందుంచాలని, సంబంధిత బుక్ కీపర్‌ను వెంటనే సస్పెండ్ చేసి విచారణ పూర్తయ్యే వరకు బాధ్యతల నుండి తొలగించాలని, అవకతవకల్లో అధికారుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుక్ కిపర్ పై పెద్దమందడి, అడ్డాకుల పోలీస్ స్టేషన్లో వివిధ కేసులు కూడా నమోదు అయినప్పటికీ, టిఆర్ఎస్ పార్టీలో చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వ జీవో ప్రకారం రాజకీయంలు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ప్రభుత్వ సంస్థలు పనిచేయరాదని జీవో ఉన్నా కూడా అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అతని సస్పెండ్ చేయాలని అడ్డాకల ఏపీఎంకు ఫిర్యాదు చేయడం జరిగింది. “ఎంతటి రాజకీయ అండ ఉన్నా వదిలిపెట్టేది లేదు ఆన్నారు. అధికారులు స్పందించకపోతే జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపడతాం” అని ఆర్టిఐ మండల అధ్యక్షులు ఆంజనేయులు హెచ్చరించారు.