బొగ్గు మసిలో విరిసిన నవ్వు… లారీ క్యాబిన్ సాక్షిగా గెలిచిన అక్షరం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ రహదారి పక్కన నిలిచిన లారీ... చేతిలో ఆవిర్లు కక్కే ఒక చిన్న పేపర్ టీ కప్పు... ముఖమంతా వికసిస్తూ పెల్లుబికిన ఒక కల్మషం లేని నవ్వు. నేడు సామాజిక మాధ్యమాల్లో కోట్ల మందిని నవ్విస్తున్న ఒక వైరల్ మీమ్ అది. కానీ, క్షణికావేశాల రీల్స్ విపణి చూడలేని ఒక అసలుసిసలైన జీవన సంగ్రామం ఆ నవ్వు వెనుక దాగి ఉంది. ఆ కుర్రాడి పేరు అరుణ్...