POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:05 am Posted by : POLITICAL POWER

బోనాల పండుగ ఏర్పాట్లకు డిప్యూటీ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఓల్డ్ మల్కాజ్గిరి వాసులు

పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ మల్కాజ్గిరి లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లకు అన్ని డిపార్ట్మెంట్ లతో, మాజీ కార్పొరేటర్ శ్రవణ్ తో కోఆర్డినేషన్ మీటింగ్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఏర్పాట్లన్నీ సజావుగా చేసినందుకు డిప్యూటీ కమిషనర్ సుల్తానాన్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. మరి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి అని ముఖ్యంగా పూర్తిస్థాయిలో లైటింగ్, టాయిలెట్ల ఏర్పాటు కూడా చేయవలసిందిగా విన్నవించుకున్నారు. పండుగ రోజున దేవాలయం వద్దకు రావాలని ఏర్పాట్లను చూసుకోవాలని, అమ్మవారి దర్శనం చేసుకుని దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివ్య జ్యోతి, బి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రశాంతి, సునీల్ యాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు.