POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 11:55 pm Posted by : POLITICAL POWER

బ్రాహ్మణుల అభ్యున్నతికి మైలురాయి: అనపర్తిలో మినీ కల్యాణ మండపం గృహప్రవేశం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదిన పత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే01:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: బ్రాహ్మణుల సంక్షేమానికి దోహదపడేలా నిర్మితమైన మినీ కల్యాణ మండపం నేడు ఘనంగా గృహప్రవేశం జరుపుకుంది. మాజీ శాసనసభ్యుడు, వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘానికి మినీ కల్యాణ మండపం నిర్మాణం కోసం స్థలం కేటాయించబడింది. ఆ నిర్ణయం ఫలితంగా నిర్మాణం పూర్తిై, సమాజానికి ఉపయోగపడే వేదికగా ఇది రూపుదిద్దుకుంది.
గృహప్రవేశ కార్యక్రమంలో మాట్లాడిన సత్తి సూర్యనారాయణ రెడ్డి, మండప నిర్మాణాన్ని పూర్తి చేసిన కమిటీ సభ్యుల కృషిని అభినందిస్తూ, ఇది భవిష్యత్తులో బ్రాహ్మణ సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు సత్తి సూర్యనారాయణ రెడ్డిని దుస్సాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ మండప నిర్మాణం ఆయన తీసుకున్న నిర్ణయంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) పాల్గొన్నారు. ఆయన చేసిన సహకారానికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు.
విష్ణాలయం, శివాలయం సమీపంలో, బ్రాహ్మణులు అధికంగా నివసించే ప్రాంతంలో ఈ స్థలాన్ని కేటాయించడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన వేదికను అందించే దిశగా ముందడుగు పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.