బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడి డిప్యూటీ తహసీల్దార్ కేడర్ అధికారి బలి! – పౌర సరఫరాల శాఖ మేనేజర్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యతో బయటపడ్డ దందా!
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* భద్రాచలం /పాల్వంచ: సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టాల్సిన కలం... కొందరి చేతుల్లో బ్లాక్‌మెయిలింగ్ ఆయుధంగా మారిపోతోంది! రాజకీయ తరహాలో బెదిరింపులకు దిగుతూ, లంచగొండి దందాలకు అడ్డువచ్చిన ప్రభుత్వ అధికారుల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్న ఘోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.పాల్వంచకు చెందిన పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్ కేడర్ అధికారి...