POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 4:10 pm Posted by : POLITICAL POWER

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి! – కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు – సోదరుడు బుసినే శ్రీరాములుతో కలిసి మండల దీక్ష స్వీకరణ

 

పిపిఎన్ 9 న్యూస్ / అనంతపురంజిల్లా

కర్నూలు ప్రతినిధి  అంపయ్య ఎం (నవంబర్ 06, 2026):

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో భక్తి ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. కార్తిక మాస పవిత్ర సమయాన్ని పురస్కరించుకుని ఆయన నిష్ఠతో మండల దీక్షను స్వీకరించారు.

నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

మాలధారణ అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం

ఎమ్మెల్యే బుసినే విరుపాక్షితో పాటు ఆయన సోదరుడు బుసినే శ్రీరాములు కూడా భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల దీక్షను స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శరణుఘోషతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.

ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి చేపట్టిన ఈ మండల దీక్ష ప్రశాంతంగా, దిగ్విజయంగా పూర్తికావాలని పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షించారు.