Date of Publish : 20 September 2026, 6:01 amPosted by : POLITICAL POWER
భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు… మార్మోగిన జై గణేష్ నినాదాలు
జై బోలో గణేష్ మహారాజ్…భక్తి పారవశ్యంలో నిమజ్జనోత్సవం.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: మదనాపురం మండలం తీర్మలాయపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలు 8వ వార్డు పరమేశ్వర యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి శనివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. మంగళవాయిద్యాలు, డీజే సంగీతం, మహిళాలు బొడ్యమ్మలు, భక్తుల, యూత్ నృత్యాలతో గ్రామ వీధులు సందడిగా మారాయి. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. “గణపతి బప్పా మోరియా.. జై గణేష్ మహారాజ్” అంటూ భక్తులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వార్డు ప్రజలకు, యువతకు,మహిళలకు, ఉత్సవ నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.