భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు… మార్మోగిన జై గణేష్ నినాదాలు
జై బోలో గణేష్ మహారాజ్...భక్తి పారవశ్యంలో నిమజ్జనోత్సవం.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: మదనాపురం మండలం తీర్మలాయపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలు 8వ వార్డు పరమేశ్వర యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి శనివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ఊరేగింపుగా...