POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 8:11 pm Posted by : POLITICAL POWER

భక్త ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జులై 05 2026: దేవరకద్ర మండలం లక్ష్మిపల్లి లో భక్త ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ, సిద్దయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి మాట్లాడుతూ… ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతనుపెంపొందిస్తాయని ,దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని చిన్నారెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, లక్ష్మీ అంజనేయులు గ్రామ సర్పంచ్, కవిత నాగేశ్వర్ రెడ్డి ఉప సర్పంచ్, బోయ రాము గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి నరేష్ కుమార్, రోహిత్ రెడ్డి, ఆత్మకూర్ రాందేవ్ రెడ్డి, ఆత్మకూర్ గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.