భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో కాచవాని సింగారం, జయశంకర్ విగ్రహం సమీపంలోని నివాస ప్రాంతంలో ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా భారీ మొత్తంలో టపాసులను నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది మరియు ఇద్దరు సాక్షులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వివిధ రకాల టపాసులను ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.సుమారు 100 కిలోల టపాసులను, మొత్తం 58 పెట్టెలు మరియు...