పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీబీ తెలుగు న్యూస్ జూలూరుపాడు, జూలై 29 2026: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆమోదంతో, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా మంద శ్రీను ను నియమించారు. గట్ల రాజన్న, జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ ఆధ్వర్యంలో మంద శ్రీనుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మంద శ్రీను అంకితభావంతో, నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి విశేషంగా సేవలందించాలని సూచించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ మాట్లాడుతూ… జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నూతన జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మంద శ్రీనుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో పార్టీ సోషల్ మీడియా విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.