POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 4:47 pm Posted by : POLITICAL POWER

భారతదేశం మీద విషం చీమ్ముతున్న రాహుల్ గాంధీ : ఈటెల రాజెందర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

ప్రపంచ వేదికలమీద రాహుల్ గాంధీ భారతదేశం మీద విషం చిమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు. భారత దేశ వ్యతిరేక శక్తులను కలిసేందుకు వెళ్తున్నారనే రేవంత్ రెడ్డి టూర్ కి అనుమతి ఇవ్వలేదు. కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు. అడిగిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చింది. ఐదు కేజీల బియ్యం ఇస్తున్న మోడీ గారి ఫోటో రేషన్ కార్డ్ మీద వేయడం లేదు, కానీ కేజీ బియ్యం ఇస్తున్న రేవంత్, ఉత్తమ్ ఫోటోలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం మారితే మళ్ళీ కార్డ్స్ ప్రింట్ చేస్తారా?. ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా ?.

*రేవంత్ రెడ్డి సంకుచితంగా వ్యవహరించవద్దు : ఈటల రాజేందర్, ఎంపీ.*

రైల్వే, మున్సిపాలిటీలలో పెండింగ్ పనులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో భేటీ అయిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. పలు అంశాలపై చర్చించి, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. భేటీ తర్వాత సచివాలయం మీడియా పాయింట్ లో మాట్లాడారు.

గతంలో రైల్వే పనులకు కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా నిధులు ఖర్చు చేసేవి. కానీ ఇప్పుడు వందశాతం నిధులు రైల్వే శాఖనే ఖర్చు చేస్తుంది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక రైల్వే లైన్లు ఉంటే ఆర్వోబీ, ఆర్యూబీలు లేవు. వాటి నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తామని చెప్పింది.మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు 23 గేట్ల వద్ద ఆర్యూబీ నిర్మాణం జరుగుతుంది.                                                                రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్వోసి ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి.           మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ పనులు చేసేందుకు డబ్బులు వస్తాయా రావా అని భయంతో టెండర్లు పిలిస్తే ఎవరూ ముందుకు రావడం లేదు. చిన్న చిన్న గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీ చేశారు. అక్కడ పనులు జరగడం లేదు.

అర్బన్ హౌసింగ్ స్కీమ్, రూరల్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించేందుకు కేంద్రం నిధులు ఇస్తుంది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవాలి.                                    మెట్రో ఫెజ్ 1, 2 లకు, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది.  హైదరాబాద్ లో డ్రైనేజీలు, రోడ్లు, లైట్లు బాగోలేవు. కనీస వసతులు లేవు. వాటిని మెరుగుపరిచి సనీస సదుపాయాలు కల్పించాలని కోరాం.

రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి ఫోటోలు అవసరమా?. రేషన్ బియ్యం లో కేంద్రం వాటా ఉంది ప్రధానమంత్రి ఫోటో పెట్టరా?.                                                                           గత ముఖ్యమంత్రి కేంద్రం డబ్బులు మాకెందుకు, మేమే కట్టుకుంటామని. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదవాడి అవసరాలకు దూరంగా ఎక్కడో కట్టారు. చార్మినార్ దగ్గర ఉండే వాళ్లకు రింగ్ రోడ్డు అవతల ఇచ్చారు. ముషీరాబాద్ వాళ్లకు జవహర్ నగర్ లో.  మేము కేంద్ర మంత్రులను కలిశాము. నిజమైన పేదవారికి పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టించి ఇస్తే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంటే ఇస్తారు.                            కేంద్రం ఎక్కడా వివక్ష చూపించడం లేదు. సీ.ఎస్.ఎస్. కింద రాష్ట్రాలకు సమానంగా నిధులు మంజూరు చేస్తున్నారు. అదే కాకుండా. 6300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ 30 ఏళ్ల క్రితం మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించారు. కాంగ్రెస్ వాళ్లు 40 ఏళ్ల నుంచి ఊరించిన. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మోడీగారు నిర్మించి ఇచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్ తలపించే విధంగా తీర్చిదిద్దారు.         కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్రప్రభుత్వమైన ఖర్చు పెట్టేది ప్రజల డబ్బులే తప్ప ఎవరి జాగీరు కాదు. రాష్ట్ర అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు, అవలంబిస్తున్నారు.                                        రేవంత్ రెడ్డి టూరు రద్దు, కేంద్రం నిధులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు :  చక్కటి బుద్ధి ఉన్న వారికి అర్థమవుతుంది. వంకర బుద్ధి ఉన్నవారికి విషం కక్కే వారికి ఏం అర్థమవుతుంది. వీరి నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా, లండన్, యూరప్ వెళ్లి భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మత కల్లోలాలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్ లో జరిగిన బాంబు పేలుళ్లు, దిలుసుఖ్ నగర్లో బాంబులు పేలింది ఎవరి హయాంలో జరిగాయి గుర్తులేదా ?. అప్పుడు ప్రతినిత్యం బాంబుల పేలుళ్లు వినిపించాయి. కానీ మోడీ గారి పాలనలో సురక్షితంగా, సుభిక్షితంగా దేశం ఉంది. మీ లెక్క ఓట్ల కోసం సీట్ల కోసం పాకులాడే వాళ్ళం కాదు. దేశం ముఖ్యం తర్వాతనే పార్టీ, తర్వాతనే వ్యక్తులు, తర్వాతనే అధికారం అనేది మా ఫిలాసఫీ.

మోడీ మీద విమర్శ చేయడమంటే సూర్యుని మీద ఉమ్మి వేయడమే. ఢిల్లీకి వచ్చినప్పుడు మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి, సాయం కావాలని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి విమర్శిస్తున్నారు. కేటాయించిన డబ్బుంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ విషయాన్ని బయట ఎందుకు చెప్తలేరు?. అని ఈ మధ్యనే ప్రజాభవన్లో జరిగిన మీటింగ్లో మా ఎం.పి. లం నిలదీశాము.                            రేవంత్ రెడ్డి సంకుచితంగా ఉండవద్దు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులు వ్యక్తులు కాదు. ముఖ్య మంత్రి నాలుగు కోట్ల ప్రజానీకానికి తండ్రిలాగా వ్యవహరించాలి. ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉండాలి. తప్ప పార్టీల కోణంలో ఆలోచన చేయవద్దు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గౌరవం తగ్గితే మంచిది కాదు. గౌరవం తగ్గింపు ప్రయత్నం చేస్తే వ్యవస్థకు నష్టం.    ఇంటి నిర్మాణం కోసం ఒక లక్ష డెబ్భై ఐదు వేలు రూరల్ ఏరియాలో. రెండు లక్షల ఇరవై ఐదు వేలు అర్బన్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.

జాతీయా చౌక ధరల దుకాణల్లో ఐదు కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంటే రాష్ట్రం ఇస్తుంది ఒక కేజీ బియ్యం. కానీ మోదీ ఫోటో మాత్రం పెట్టరు, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారు. మరి మోడీ ఫోటో ఎందుకు పెట్టడం లేదు?. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఫోటో వేసి కార్డులు కొట్టిస్తున్నారు రేపు ప్రభుత్వం మారుతుంది కొత్త ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ కార్డులు కొట్టిస్తారా.?మళ్లీ ఒక 500 కోట్ల ఖర్చు కాదా ?.