POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 3:43 pm Posted by : POLITICAL POWER

భారతీయ దాంపత్య జీవితం ప్రపంచానికి ఆదర్శం

మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ దంపతులకు రజతోత్సవ వివాహ శుభాకాంక్షలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రజతోత్సవ వివాహ వేడుకల్లో మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ దంపతులను కలిసి సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.వివాహ బంధానికి 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దంపతులను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… భారతీయ దాంపత్య జీవితం ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత జీవితాంతం కలిసిమెలిసి జీవిస్తూ కుటుంబ విలువలను కాపాడేది భారతీయ సంస్కృతేనని అన్నారు. ప్రేమ, నమ్మకం, బంధం, బాధ్యతతో సాగించిన పృథ్వీరాజ్ దంపతుల దాంపత్య జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అలాగే ఒకరికొకరు తోడుగా, నీడగా నిలిచి సుఖదుఃఖాలను పంచుకుంటూ కుటుంబాన్ని అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. “సిల్వర్ జూబ్లీ” సందర్భంగా కల్యాణ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, బైరోజు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.