భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలి పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 4: దమ్మపేట మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్‌) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము డిమాండ్ చేశారు. భారీ వర్షాల ప్రభావంతో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయని ఆయన...