భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -తహసిల్దార్ రంజిత్ కుమార్ విజ్ఞప్తి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ కోరారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో,ప్రజల భద్రత దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద నివసించే ప్రజలు ప్రత్యేక...