భార్యాభర్తలపై అడవి పంది దాడి

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, ఆగస్టు 28: వాంకిడి మండలం గోయేగావ్ గ్రామంలో పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న భార్యాభర్తలపై అడవి పంది అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. దాడి అనంతరం కుటుంబ సభ్యులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అడవి జంతువుల సంచారంతో రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. గాయపడిన బాధితులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే అటవీ అధికారులు స్పందించి...