POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:46 pm Posted by : POLITICAL POWER

భీమా భవిష్యత్తుకు భరోసా 

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సునీల్

బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: భీమా భవిష్యత్తుకు ఎంతో భరోసా అని శ్రీరామ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సునీల్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో రావుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకోసం ఒక సాయంత్రం అనే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యతితులుగా డీయం సతీష్,వనపర్తి వనపర్తి జిల్లా బ్రాంచ్ మేనేజర్ రాకేష్, బ్రాంచ్ డి ఓ లు రాములు, వెంకటేష్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించి సుమారు 60 సంవత్సరాలు కావస్తుందని అన్నారు. ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరమని తెలిపారు. కానాయపల్లి గ్రాంలో సుమారు 150 కి పైగా ఇన్సూరెన్స్ హోల్డర్స్ ఉన్నారని తెలిపారు. రావుల గోపాల్ రెడ్డి కృషితో అందరికి భీమా కట్టించెందుకు చర్యలు తీసుకున్నాడని సంతోషం వ్యక్తం చేస్తూ గోపాల్ రెడ్డిని అభినందించారు. ఇదే గ్రామానికి చెందిన వడ్డే మనోజ్ ఇటీవల రోడ్ ప్రమాదంలో చనిపోవడం జరిగిందని ఆ కుటుంబానికి 13లక్షల 50వేల చెక్కును అందజేస్తు ప్రతి నెల 6 వేల చొప్పున 18 సంవత్సరాలు వస్తాయని చెప్పారు. ప్రతి రోజుకు ఎన్నో ఖర్చులు చేస్తుంటాం వాటిలో కొంత మొత్తాన్ని జమ చేసి ఇన్సూరెన్స్ కట్టుకుంటే అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి భరోసా ఉంటుందని తెలిపారు. ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది చాలా అవసరమని తెలిపారు. ముందుగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త సాయిలు, బిసి సంఘం నాయకులు భీమన్న నాయుడు, గోకరయ్య, కుర్మయ్య, రమేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, బాజ గిరన్న, విష్ణురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.