పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 27 2026: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” మహాసభకు అడ్డాకల్ మండల శాలివాహన (కుమ్మరి) సోదరులను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీ ఆర్ పి) నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీ ఆర్ పి దేవరకద్ర అసెంబ్లీ ఇంచార్జ్ మంగరాయి వెంకటేష్ (ఎంవీకే), టీ ఆర్ పి అడ్డాకల్ మండల జనరల్ సెక్రటరీ బండారి శ్రీనివాస్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు ఆంజనేయులు కలిసి శాలివాహన సంఘ నాయకులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో శాలివాహన సంఘ అడ్డాకల్ మండల అధ్యక్షుడు సూగూరు రాములు, గౌరవ అధ్యక్షులు కుమ్మరి రామచంద్రయ్య, కుమ్మరి అంజలన్న, కొండన్న, గౌరవ సలహాదారులు నరసింహ, పరశురాములు, జనార్ధన్, కార్యవర్గ సభ్యులు చిన్న, నాగరాజు, శ్రీను, బాలరాజు తదితరులు పాల్గొని ఆహ్వాన పత్రికను స్వీకరించారు. ఈ సందర్భంగా మంగరాయి వెంకటేష్ మాట్లాడుతూ… కుమ్మరి, శాలివాహన, బీసీ ఉపకులాలన్నీ ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని, జూలై 5న భువనగిరి సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బండారి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… అడ్డాకల్ మండలం నుంచి శాలివాహన సోదరులు భారీ సంఖ్యలో భువనగిరి సభకు తరలిరావాలని, వారికి టీ ఆర్ పి అండగా ఉంటుందని తెలిపారు. “అధికారం – ఆత్మగౌరవం” నినాదంతో భువనగిరి మహాసభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.