భూగర్భ వారాహి మాత ఆలయంలో ఘనంగా పంచమి వేడుకలు

  పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక జూన్ 06: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో కొలువై ఉన్న ప్రసిద్ధ భూగర్భ వారాహి మాత ఆలయంలో పంచమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు తదితర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలు, అర్చనలు, సహస్రనామ పారాయణాలు భక్తిశ్రద్ధలతో...