భూగర్భ వారాహి మాత ఆలయం అద్భుతం – అమ్మవారిని దర్శించిన జక్కంపూడి విజయలక్ష్మి
పొలిటీకల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే01 తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మితమైన భూగర్భ వారాహి మాత ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని వైఎస్సార్‌సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, బలభద్రపురం...