పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి దమ్మపేట మండల కేంద్రంలో ని మల్లారం సరిహద్దుల్లో గల 589/ బై సర్వేనెంబర్ ఉన్న కొన్ని ఎకరాల భూములు అక్రమదారుల పాలయ్యాయి. వీటికి కొమ్ముగాస్తున్నది ఎవరు? దమ్మపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అనేవి సొంత స్థలం అంటే సుమారు 110 గజాలు ఉన్నవాళ్లకే కేటాయించడం జరిగింది.కానీ ఇదే దమ్మపేట గ్రామంలో సెంటు భూమి కూడా లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం అంటే వారికున్న సొంత భూమిలో ఇల్లు కట్టించడం కాదు ప్రభుత్వమే స్థలం కేటాయించి ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టించి ఇవ్వటం. ఇలా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలంటే ఇలా భూ కబ్జా కి గురైన భూములను ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఇల్లు లేని నిరుపేదలకు ఆ స్థలాలలో ఇల్లు నిర్మిస్తే పేదవాళ్లకు చాలా మంచి చేసిన వారు అవుతారని ప్రజల ఆకాంక్ష. అలా చేయకుండా ప్రభుత్వం కూడా భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తాం అంటే. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ముందుకు వచ్చి ఆ కబ్జా అయిన భూములను మాస్ లైన్ పార్టీ తరఫున పేదలకు ఇస్తామని కరాకండిగా చెబుతున్నారు,..