పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :
పోచారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగులమందులు వినియోగిచడం మానుకొని, భూమికి పుష్టినిచ్చే సేంద్రియ, జీవన ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు రైతులకు పిలుపునిచ్చారు.’ఖేత్ బచావో అభియాన్’ (పొలాలను సంరక్షంచే కార్యక్రమం) పంట భూముల ఆరోగ్యాన్ని పరిరక్షంచడం ద్వారా రాబోయే తరాలకు సారవంతమైన భూములను అందించాల్సిన బాధ్యత రైతులపైఉందన్నారు.రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని,వాటి నివేదిక ల ఆధారంగా అవసరమైన మేరకు ఎరువులను వినియోగించుకావాలి సూచించారు. పచ్చిరోట ఎరువులు, పశువుల ఎరువుల వినియోగం ద్వారా భూమి జీవశక్తిని కాపాడుకోవచ్చని తెలిపారు. సమగ్ర ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు వివరించారు.స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

