POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:38 pm Posted by : POLITICAL POWER

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలు

బ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధి

తమ అనుభవంలో ఉన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, పాస్‌పుస్తకాలు మంజూరు చేసి ఆన్‌లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రహ్మంగారి మఠం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు లింగాలదిన్నె పల్లె ఎస్టీ కాలనీ ప్రజలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఈ దీక్షలకు ఎస్‌ఎఫ్‌ఐ (SFI) మండల అధ్యక్షులు అరవింద్ మద్దతు తెలిపి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల భూములకు రక్షణ కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్, లింగాలదిన్నె పల్లె ఎస్టీ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు.