POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:25 pm Posted by : POLITICAL POWER

భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా పట్టా భూముల సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలి 

– భూముల రీసర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు,
భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశం,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 30. 2026. భూముల రీసర్వే ప్రక్రియనుపారదర్శకంగా,పకడ్బందీగానిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పట్టా భూముల సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్‌తో కలిసి కొత్తకోట మండల పరిధిలోని నాంచారంపేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వేయర్లు భూములను సర్వే చేస్తున్న తీరును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

తొలుత గ్రామ సరిహద్దులు.. ఆ తర్వాత భూముల సర్వే

రీసర్వేలో భాగంగా ముందుగా గ్రామసరిహద్దులను గుర్తించాలని, అనంతరం ప్రభుత్వ భూములను, ఆ తర్వాత పట్టా భూములను సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల సర్వే సందర్భంగా ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే, వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.
పట్టా భూముల సర్వేకు ముందు సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్వేపూర్తయినఅనంతరంభూములకుసంబంధించిన వివరాలను రైతులకు తెలియజేసి, వారి సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. రీసర్వే ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, రైతుల భూముల వివరాల్లో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సామాజిక ఆరోగ్య కేంద్రం పనులు వేగవంతం చేయాలి
అనంతరం కొత్తకోట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణాన్ని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సుభాష్, కౌన్సిలర్ సంజీవులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.