POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 3:16 pm Posted by : POLITICAL POWER

భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలి

– ఎల్-నినో ప్రభావంపై రైతులకు అవగాహన  ప్రత్యామ్నాయ పంటల సాగుకు చేసుకోవాలి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25.2026.

భూముల రీసర్వేప్రక్రియనుపారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఘన్‌పూర్ మండలంలోని ల్యాండ్ రీ-సర్వే  పైలట్ ప్రాజెక్ట్ గ్రామమైన మల్కాపూర్‌లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మల్కాపూర్ గ్రామాన్ని ల్యాండ్ రీ-సర్వే పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం ప్రత్యేక అవకాశమని అన్నారు. భూముల రికార్డులను సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడం, భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించడం, డిజిటల్ భూ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు.ల్యాండ్ రీ-సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, రైతులు తమ భూముల సరిహద్దుల నిర్ధారణలో రెవెన్యూ, సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. గ్రామస్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధితఅధికారులనుసంప్రదించినివృత్తిచేసుకోవాలనిసూచించారు.అనంతరం ఎల్-నినో ప్రభావంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, రాబోయే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక పంట రకాల ఎంపిక, బిందు సేద్యం (మైక్రో ఇరిగేషన్) వంటి నీటిపొదుపుపద్ధతులను అనుసరించాలని తెలిపారు.ఉద్యానవన పంటల సాగులో నేలతేమనుకాపాడుకునే చర్యలు చేపట్టడంతో పాటు, దిగుబడి తగ్గకుండాశాస్త్రీయపద్ధతులనుపాటించాలని రైతులకు సూచించారు. ఎల్-నినో ప్రభావానికి సంబంధించిన అన్నిజాగ్రత్తలు, సాంకేతిక సూచనలను క్షేత్రస్థాయిలో రైతులకునిరంతరంఅందిస్తూఅందుబాటులో ఉండాలని మండలస్థాయిఅధికారులు, వ్యవసాయఅధికారులు(ఏఓలు),ఉద్యానవన అధికారులు మరియు పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.