భూసేకరణలో పారదర్శకత, నిష్పక్షపాతమే కీలకం

అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం అందించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24 2026: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో భూసేకరణ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులపై రెవెన్యూ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు....