POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 3:19 pm Posted by : POLITICAL POWER

భూ రీ-సర్వే పనులను పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి 

– అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 29.2026.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామాలభూరీసర్వేకార్యక్రమాన్నిపారదర్శకంగా,నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశించారు.మంగళవారం ఘన్‌పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామం, కొత్తకోట మండలంలోని పుల్లారెడ్డికుంట గ్రామాల్లో కొనసాగుతున్న డిజిటల్ భూ రీ-సర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్వే బృందాలు రైతులసమక్షంలోనే భూసరిహద్దులనుస్పష్టంగాగుర్తించాలనిసూచించారు. డ్రోన్, రోవర్ వంటి ఆధునిక సర్వే పరికరాలను సమర్థవంతంగా వినియోగించి భూ విస్తీర్ణం నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని ఆదేశించారు.సర్వే ప్రక్రియలో రైతులకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు తలెత్తితే రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు వెంటనే స్పందించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారి సహకారంతో రీ-సర్వే పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. రీ-సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన వివరాలను వెంటనే రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని, భూ యజమానుల వివరాలు, సరిహద్దులు, విస్తీర్ణం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల నాణ్యతపై రాజీ పడవద్దని, ప్రతి దశను అధికారులుక్షేత్రస్థాయిలోపర్యవేక్షించాలని,ప్రభుత్వంనిర్దేశించినగడువులోగా రీ-సర్వే ప్రక్రియనువిజయవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులనుఆదేశించారు. ఈ తనిఖీలో సర్వే శాఖ ఏడి శ్రీనివాసులు, సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే బృందాలు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.