మండల స్థాయి క్రీడల్లో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థుల ప్రతిభ
పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 18: అశ్వారావుపేటలో 17-09-2026న నిర్వహించిన మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. క్రీడా విభాగంలో జూనియర్ స్థాయి కబడ్డీలో ప్రథమ బహుమతి, కోకోలో ప్రథమ బహుమతి, సీనియర్ స్థాయి కోకోలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో జూనియర్ స్థాయి షాట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులను విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో పాఠశాల తరఫున మొత్తం 55...