POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 10:44 pm Posted by : POLITICAL POWER

*మట్టిలో పుట్టాం… మట్టిలో కలవాలి… మధ్యలో అహంకారం ఎందుకు…???

 

సూర్యుని ప్రయాణం _”చీకటి”_ పడేవరకు… చంద్రుని ప్రయాణం, పగలు వచ్చేంతవరకు… అలల ప్రయాణం తీరం చేరేవరకు… మంచి స్నేహితునితో ప్రయాణం మనం జీవించి ఉన్నంతవరకు.

జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో. అంతే సులభంగా నిందిస్తారు కూడా… కాబట్టి, నింద పొగడ్తలను పట్టించుకోకుండా మామూలుగా జీవించడానికి ప్రయత్నిస్తే _”ఆనందం”_ మన సొంతమవుతుంది.

నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ శాంతిని కలిగేలా చేస్తాయి.

వేల కోట్ల సంవత్సరాల ప్రయాణం తర్వాత, ఈ విశ్వం మనిషి మేధస్సుని _”నేను ఎవరు?”_ అని అడిగేలా చేసింది.

మనిషికి తప్ప మరే ప్రాణికి _”నా కర్తవ్యం ఏమిటి, నా గమ్యం ఏమిటి?”_ అనే తలంపు రాదు.

దేవుడికో లేదా విధికో తెలుసు ఏమి జరుగుతుందో, ఏమి జరగాలనుందో…

తగిన సమయంలో జరిగేది జరుగుతుంది.

బాట ఎన్నో వంపులతో ఉండవచ్చు, గుంటలు గతుకులు ఉండవచ్చు…

ఐనా ఆ మార్గం అందమైన ప్రదేశానికే చేరుస్తుంది. అలాగే జీవితంలో కష్టనష్టాలకు చింతించకు, ఆగకుండా ముందుకు సాగు… ఆనందాన్ని చేరుకుంటావు.

పాము నీకు దూరంగా ఉంటే నిన్ను కాటువేయలేదు… అలాగే దుష్ట విషయాలకు దూరంగా ఉంటే నీకు హాని జరగదు.

కుండను అడిగారట _”ప్రతి పరిస్థితిలో శాంతంగా ఎలా ఉంటావని?”_

కుండ చెప్పిందట… _”మట్టిలోంచి వచ్చానని, తిరిగి మట్టిలో కలిసిపోతానని గుర్తుంచుకుంటాను… ఇంకెందుకు గర్వం, కోపం.”_

శ్మశానం చూస్తే ఒకటే గుర్తుకు వస్తుంది…

మనిషి బూడిదవడానికి, జీవితమంతా ఇతరులను చూసి అసూయతో తపిస్తున్నాడని.

నలభై ఏళ్ల వరకు నీ ముఖం తల్లిదండ్రుల పోలిక… నలభై దాటాక నీ ముఖం నీవు చేసిన పనుల ప్రతిబింబం.

పుట్టినప్పుడు పంచే మిఠాయి, చచ్చినప్పుడు వడ్డించే పాయసం ఆ వ్యక్తి తినలేడు… అతను రాజైనా, ఫకీరైనా… _ఇంక అహంకారం ఎందుకు?_