POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 7:54 pm Posted by : POLITICAL POWER

మట్టిలో మాణిక్యాలు శేరుపల్లి విద్యార్థులు – పలుస శంకర్ గౌడ్ ప్రశంసలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 24 2026: శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలో చదువుకున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ప్రశంసించారు. శనివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 5 గురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పల్లెటూళ్ళలో పుట్టి క్రమశిక్షణతో చదువుకొని గొప్పగా ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారని అలాంటి వారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుండే చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకొని అందులో చక్కగా రాణించాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫెన్సింగ్ (కత్తి యుద్ధ)పోటీలో ద్వితీయ స్థానం సాధించిన సురేఖ, భువనేశ్వర్ లలోని సైనిక్ స్కూల్ లో సీటు సాధించిన భార్గవ్, రూపా సీఈఓ కాలేజీలో సీటు సాధించిన రూప, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఫైనల్ లో బెస్ట్ మార్కులు సాధించిన వర్ష లను కళావేదిక పక్షాన శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల అంకితభావం ఉందని కొనియాడుతూ ఉపాధ్యాయులు నరసింహ, రమేష్, ఈశ్వర్ రెడ్డి, ప్రసన్న లను కూడా సన్మానించారు. ఈనాటి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య,ఉప సర్పంచ్ బిచ్చన్న,ఎం.ఈ.ఓ హనుమంతు,కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్, రంగస్థల కళాకారుల జిల్లా అధ్యక్షుడు ఎల్.ఉమా మహేశ్వర్,మొయినుద్దీన్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.