POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:12 pm Posted by : POLITICAL POWER

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి

-పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: దీపావళి పండుగను మట్టి ప్రమిదలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ఈ దీపావళి మన ఇంట్లోనే కాదు, మన మనసులో కూడా వెలుగులు నింపాలి. ఈసారి దీపావళిని మట్టి ప్రమిదలతో, పర్యావరణహితంగా జరుపుకుందాం” అని అన్నారు. “మట్టి ప్రమిదలు వెలిగిస్తే మన సంప్రదాయం బతుకుతుంది. కుమ్మరి కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. ప్లాస్టిక్ దీపాలకు, చైనా లైట్లకు దూరంగా ఉండి, స్వదేశీ వస్తువులనే వాడుదాం” అని శంకర్ గౌడ్ అన్నారు. “బాణసంచా శబ్దం, పొగ వల్ల పిల్లలు, వృద్ధులు, రోగులు, మూగజీవాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే శబ్దం తక్కువ, సంతోషం ఎక్కువ అనే నినాదంతో దీపావళి జరుపుకోవాలి. టపాసులు కాల్చడం కాదు, దీపాలు వెలిగించి ఆనందాన్ని పంచడమే నిజమైన దీపావళి” అని పేర్కొన్నారు. “మన ఇంటి ముందు రంగవల్లులు, మామిడి తోరణాలు, మట్టి ప్రమిదలతో సంప్రదాయ శోభను తీసుకురావాలి. పండుగ అంటే కేవలం కొత్త బట్టలు, స్వీట్లు కాదు, ప్రేమను పంచడం. పేదవారికి, అనాథ పిల్లలకు, వృద్ధులకు సాయం చేస్తేనే పండుగకు నిజమైన అర్థం” అని అన్నారు. “కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరం కలిసి జరుపుకునే పండుగ దీపావళి. మన పిల్లలకు మట్టి ప్రమిదల ప్రాముఖ్యతను, పర్యావరణ పరిరక్షణను చెప్పాలి. ఒక్కో ప్రమిద వెలిగించేటప్పుడు ఒక్కో మంచి ఆలోచనను మనసులో వెలిగించాలి. అహంకారం, అసూయ, ద్వేషం అనే చీకట్లను వదిలి, ప్రేమ, శాంతి అనే వెలుగులను నింపుకోవాలి” అని శంకర్ గౌడ్ గారు అన్నారు. “వనపర్తి జిల్లా ప్రజలందరి ఇళ్లలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు అందరికీ ఈ దీపావళి కొత్త వెలుగులు తీసుకురావాలి. సాహితీ కళా వేదిక తరపున ప్రతి కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మట్టి ప్రమిదలు వెలిగిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, మన సంస్కృతిని కాపాడుదాం” అని ఆయన అన్నారు.