– నిమజ్జన ప్రదేశాలు సరళ సాగర్, రామన్‌పాడ్, కొత్తపల్లి బ్రిడ్జ్ ప్రదేశాలను పరిశీలన, అన్నిశాఖల సమన్వయంతోగణేష్,ఉత్సవాలనువిజయవంతం చేయాలని అధికారులకు సూచనలు,
– సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే కఠినచర్యలు,చిన్నఘటనకూడాపెద్దసమస్యగామారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి ఎస్పీ. సునీత రెడ్డి,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.10.2026.ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకంకలిగేలాప్రతిపోలీస్,అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అదే సమయంలోగణేష్,ఉత్సవాలు, నిమజ్జనకార్యక్రమాలుఎలాంటిఅవాంఛనీయసంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలాముందస్తుభద్రతాచర్యలనుపటిష్టంగాఅమలుచేయాలనిజిల్లాఎస్పీ.సునితరెడ్డి.అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి మదనాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి ఫిర్యాదులస్వీకరణ,బాధితులతోసిబ్బందివ్యవహరించే తీరు, ఫిర్యాదుల నమోదు, పరిష్కార విధానం, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, సమస్యాత్మక వ్యక్తుల రికార్డులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనంతరం గణేష్ ఉత్సవాల సందర్భంగా మదనాపూర్ మండలంలోని నిమజ్జన ప్రదేశాలు సరళ సాగర్, రామన్‌పాడ్, కొత్తపల్లి బ్రిడ్జ్ ప్రదేశాలనుక్షేత్రస్థాయిలోపరిశీలించి,భక్తులకు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలనిఅధికారులను ఆదేశించారు.గణేష్,నిమజ్జనోత్సవాలనుసమన్వయం అప్రమత్తతతో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈసందర్భంగాఎస్పీ.మాట్లాడుతూపోలీస్,స్టేషన్‌కువచ్చేప్రజల్లోపోలీస్,శాఖపైవిశ్వాసంపెరిగేలాపారదర్శకంగా,బాధ్యతాయుతంగాసేవలుఅందించాలని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూరాత్రింబవళ్లుపెట్రోలింగ్,నిఘాచర్యలుకొనసాగిస్తూ ఆకతాయిలు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వ్యక్తులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయివిక్రయాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా వేదికల్లో అసత్య ప్రచారాలు, వదంతులు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టులులేదాచట్టవ్యవస్థకుభంగంకలిగించేసందేశాలను ప్రచారం చేసే వారిని గుర్తించిసైబర్,చట్టాలప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలు ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా చూడటం పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైనబాధ్యత.ఎలాంటిఅవాంఛనీయసంఘటనకు అవకాశం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలి. చిన్నపాటి ఘటన కూడాపెద్దసమస్యగా మారకుండా ముందుగానే గుర్తించి నివారించే విధంగా ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.గణేష్ మండపాల నుంచి నిమజ్జన ప్రదేశాలవరకునిరంతరనిఘాకొనసాగాలి.సమస్యాత్మక వ్యక్తులు, గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిమజ్జన రూట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఈవ్‌టీజింగ్, ఆకతాయితనం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, కొత్తకోట సీఐ,ఓడి రమేష్, వనపర్తి సీఐ,సుగంధరత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, మదనాపూర్ ఎస్సై, జగదీశ్వర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




